- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇసుక లోడింగ్ సామర్థ్యం పెంచాలి

దిశ, కోటపల్లి : కోటపల్లి మండలంలోని ఎర్రాయిపేట, కొల్లూరు ఇసుక రీచ్ లను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పోల్చుకుంటే లోడింగ్ సామర్థ్యం చాలా తక్కువగా ఉందని కాంట్రాక్టర్, టీజీఎండీసీ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోడింగ్ కెపాసిటీని 200 లారీలకు పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో లభ్యమయ్యే ఇసుకకు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉండడంతో ఇసుక రీచ్ ల ద్వారా జిల్లా నుంచి ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఇచ్చే దిశగా చర్యలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు.
మ్యాన్ పవర్ పెంచి లోడింగ్ కెపాసిటీ ని కూడా పెంచాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా 63వ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రోడ్లపై లారీలను పార్కింగ్ చేయరాదని, వెంటనే క్లియర్ చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ సుధాకర్, ఎస్ఐ రాజేందర్ కోటపల్లి, తహసీల్దార్ రాఘవేందర్ రావు, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, ఆర్ఐ శ్రీనివాస్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.