AP: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన వైస్ ఎంపీపీ ఎన్నిక

by srinivas |   ( Updated:2025-03-28 10:49:32.0  )
AP:  దంపతుల మధ్య చిచ్చు పెట్టిన వైస్ ఎంపీపీ ఎన్నిక
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District)లో గురువారం జరిగిన వైస్ ఎంపీపీ(Vice MPP) ఎన్నిక దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. పుల్లలచెరువు మండలం వైస్ ఎంపీపీ ఎన్నికలో భార్య ఎంపీటీసీ నాగేంద్రమ్మ.. వైఎస్సార్ కాంగ్రెస్(YSR Congress) పార్టీకి ఓటు వేశారు. దీంతో భర్త పోలయ్య తన ఉద్యోగం పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ముటుకుల గ్రామం విద్యుత్ సబ్ స్టేషన్‌(Mutukula Village Electricity Substation)లో కాంట్రాక్ట్ పద్ధతిలో వాచ్‌మెన్‌గా పోలయ్య పని చేస్తున్నారు. అయితే ఎన్నికకు ముందు పోలయ్యను స్థానిక టీడీపీ నాయకులు కలిశారు. వైసీపీకి నాగేంద్రమ్మ ఓటు వేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని పోలయ్యను బెదిరించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయించాలని హుకుం జారీ చేశారు. అయితే భార్య నాగేంద్రమ్మ మాత్రం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారు.

దీంతో దంపతుల మధ్య అసలు రచ్చ మొదలైంది. వైసీపీకి ఓటు వేసిన నాగేంద్రమ్మ వెంటనే తమ పుట్టింటికి వెళ్లిపోయారు. భర్త పోలయ్య తనను ఏమైనా అంటారేమోనని భయపడిన ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతొ నాగేంద్రమ్మ భర్త పోలయ్య ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నేతలు తనను ఉద్యోగం నుంచి తొలగిస్తారేమోనని భయపడిపోతున్నారు. విషయం తెలుసుకున్నస్థానిక వైసీపీ నేతలు పోలయ్యతో మాట్లాడారు. ఉద్యోగం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చారు. ఈమేరకు భర్త పోలయ్య ఆందోళన విరమించి విధులకు వెళ్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.



Next Story

Most Viewed