Drone cam: చెట్టుతొర్రలో నాటుసారా.. పట్టించిన డ్రోన్ ​కెమెరా

by Anil Sikha |
Drone cam: చెట్టుతొర్రలో నాటుసారా.. పట్టించిన డ్రోన్ ​కెమెరా
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : రహస్యంగా చెట్టు తోర్రలో ఉన్న నాటు సారాయిని అధునాతన డ్రోన్ కెమెరా పసికట్టి పట్టించింది. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బాకరాపేట సీఐ ఇమ్రాన్ బాషా ఆధ్వర్యంలో యర్రవారి పాళ్యం పోలీసు స్టేషన్ పరిధిలోని నాటుసారా స్థావరాలపై అధునాతన డ్రోన్స్ తో దాడులు చేశారు. యర్రవారిపాళ్యం మండలం లోని వెములవాడ గ్రామం, తలకోన వాటర్ కెనాల్ సమీపంలో గుట్టుచప్పుకాకుండా చెట్టుతొర్రను లో ఉన్న తొమ్మిది లీటర్ల నాటు సారాయిను పోలీసు సిబ్బంది పట్టున్నారు. డ్రోన్ కెమెరా సిగ్నల్ ఇచ్చిన వేంటనే స్ధానిక పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో నాటు సారాయి కాసే ఇద్దరు రహస్యంగా తప్పించుకు పారిపోతున్న వేముల హనుమంతు, ఎస్ మునిస్వామిని పోలీసు సిబ్బంది రౌండప్ చేసి పోలీసు సిబ్బంది పట్టుకున్నారు.



Next Story