పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కీలక పరిణామం.. మహారాష్ట్రలో 107 మంది పాకిస్తానీలు మిస్సింగ్

by Shiva |
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కీలక పరిణామం.. మహారాష్ట్రలో 107 మంది పాకిస్తానీలు మిస్సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని పహల్గాం (Pahelgam) ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం (Central Government) పాకిస్థాన్ (Pakistan) దేశస్థుల వీసాలను రద్దు చేసి, వారిని దేశం విడిచి వెళ్లాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా పాకిస్థానీయులను గుర్తించి వారి వివరాలను కేంద్రానికి పంపాలంటూ ఇప్పటికే అమిత్ షా (Amit Shah) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా ఫోన్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసులు దేశంలో ఉన్న పాక్ పౌరుల లెక్కలు తీస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

మహారాష్ట్ర (Maharashtra)లో ఏకంగా 107 మంది పాకిస్థానీయులు కనిపించకుండాపోవడం కలకలం రేపుతోంది. అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం వివిధ రకాల వీసాలపై 5,023 మంది పాకిస్థానీలు ప్రస్తుతం రాష్ట్రంలో నివసిస్తున్నారు. నాగ్‌పూర్‌ (Nagpur)లో 2,458 మంది నివాసితులు ఉండగా.. అందులో 25 మంది జాడ తెలియడం లేదు. థానే (Thane)లో 393 మంది, పింప్రి-చించ్వాడ్‌ (Pimpri-Chinchwad)లో 239 మంది నివాసులు ఉండగా.. అందులో ఇద్దరు కనపించడం లేదు. ఇక నవీ ముంబై (Navi Mumbai) ప్రాంతంలో 239 నివాసితులు ఉండగా ఇద్దరు అప్‌స్కాండ్ అయ్యారు. పూణే (Pune)లో 114 మంది ఉండగా 9 మంది ఆచూకీ లేదు, 24 మంది అక్రమంగా నివసిస్తున్నట్లుగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు.



Next Story

Most Viewed