- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. శనివారం భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, ఎంతమంది సిబ్బంది విధులకు హాజరయ్యారని, ఎంత మంది సిబ్బంది హజరు కాలేదని ఆరా తీశారు. అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలన్నారు. ఓ. పి రిజిస్టర్ ను పరిశీలించి, ఎంత మంది పేషెంట్లు ఆస్పత్రికి వచ్చారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్ గురించి అడిగి తెలుసుకున్నారు. మందుల కొరత లేకుండా చూడాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రిలో వైద్యులు,సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలో వార్డును పరిశీలించి చికిత్స పొందుతున్న పేషంట్లతో కలెక్టర్ మాట్లాడుతూ..వారికి అందుతున్న వైద్యం గురించి పేషెంట్ లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు వైద్యం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన సేవలు అందించాలని, ఆసుపత్రి నిర్వహణ మెరుగ్గా ఉండాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా మెరుగైన వైద్యం అందుతుందని, పేషెంట్లు ప్రైవేట్ హాస్పటల్ కు వెళ్లి డబ్బులను వృధా చేసుకోవద్దని సూచించారు.