ఏపీ సీఎస్‌గా విజయానంద్..?

by srinivas |
ఏపీ సీఎస్‌గా విజయానంద్..?
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా కే.విజయానంద్ (1992)ను సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న సీఎస్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న తరుణంలో తరువాత ఎవరు సీఎస్ అనే దానికి ముగింపు పలికినట్లు తెలుస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలలో ఆరితేరిన చంద్రబాబు బీసీ ఓటు బ్యాంకును పదిలపరుచుకునే దిశగా బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ కులస్తుడైన విజయానంద్‌కు చీఫ్ సెక్రటరీగా అవకాశం కల్పించనున్నారు. ఈ క్రమంలో జి.సాయి ప్రసాద్(1991)కు విజయానంద్ తరువాత కనీసం ఏడాది పాటు చీఫ్ సెక్రటరీగా పనిచేసే అవకాశం ఇవ్వనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

అనంత రాముకు ఎందుకు దక్కలేదంటే..

వాస్తవానికి సీనియారిటీ ప్రాతిపదికన అయితే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అనంత రాము (1990)కు చీఫ్ సెక్రటరీ ఇవ్వాల్సి ఉండగా ఆయన కర్ణాటక వాస్తవ్యుడు కావడం, రాజకీయ పలుకుబడి లేకపోవడం అనంత రాముకు అవకాశం దక్కలేదని సచివాలయ వర్గాల సమాచారం. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న సుమిత దావ్రా(1991)కు 2025 మార్చి వరకే సర్వీసు ఉండగా ఆర్పీ సిసోడియా (1991)కు మరో మూడేళ్ల సర్వీసు ఉంది.

Advertisement

Next Story