రక్తంతో రతన్ టాటా చిత్రం

by Naveena |
రక్తంతో రతన్ టాటా చిత్రం
X

దిశ,మరికల్ : నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రానికి చెందిన సంపత్ అనే కళాకారుడు ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా చిత్రపటాన్ని తన రక్తంతో వేసి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచి చిత్రాలు గీయడం అలవాటుగా ఉందన్నారు. వివిధ ప్రముఖుల చిత్రపటాలను వేసే వారిని ఆదర్శంగా తీసుకున్నానని అన్నాడు. తన కళా నైపుణ్యాన్ని భవిష్యత్తులో చిన్నారులకు ఉచితంగా నేర్పించడం జరుగుతుందన్నారు. సంపత్ కళా నైపుణ్యాన్ని ధన్వాడ పట్టణ,వివిధ గ్రామాల ప్రజలు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed