- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు
దిశ,గండిపేట్ : సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం నూతన సంవత్సరంలో మరింత ముందుకు వెళ్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లు అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవతో పని చేస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. సీఎం సహకారంతో నూతన సంవత్సరంలో నియోజకవర్గ అభివృద్దికి మరింత శ్రమిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ నూతన చైర్మన్ తలారి మల్లేష్, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.