- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Murder : 14 ఏళ్ల విద్యార్థి దారుణ హత్య.. ఘటన ఎక్కడ జరిగిందంటే..?
దిశ, నేషనల్ బ్యూరో : 14 ఏళ్ల విద్యార్థిని తన క్లాస్‌మేటే నలుగురు వ్యక్తులతో కలిసి కత్తితో పొడిచి చంపడం తీవ్ర కలకలం రేపింది. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షరక్‌పూర్ ఏరియాలోని రాజ్‌కీయ సర్వోదయ బాల విద్యాలయ నెం.2 ఇషు గుప్తా(14) చదువుతున్నాడు. ఎక్స్ ట్రా క్లాస్ విషయంలో శుక్రవారం రాత్రి క్లాస్‌మేట్ కృష్ణతో వాగ్వాదం జరిగింది. స్కూల్ ముగిసిన తర్వాత ఇషు గుప్తా గేట్ బయటకు రాగానే నలుగురు వ్యక్తులతో కలిసి కృష్ణ విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. నిందితుల్లో ఒకరు గుప్తా తొడపై కత్తితో పొడిచాడు. పాఠశాల సిబ్బంది గమనించి వెంటనే బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇషు గుప్తా చనిపోయినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ హత్య కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఐదుగురు మైనర్లు ఉన్నారన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్‌కి తరలించామని.. విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.