- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాపం పసివాల్లు.. నా అనేవారు లేక అటవీ ప్రాంతంలో తిరుగుతున్న అన్నదమ్ములు..
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూరు మండలం దాస్ నగర్ అటవీ ప్రాంతంలో నా అనే వారు ఎవరూ లేని ఇద్దరు అన్నదమ్ములు బాటసారుల వలె తిరుగుతుండగా మాక్లూర్ మండలంలోని పోలీసులు గుర్తించి వారిని మాక్లూర్ పోలీస్ స్టేషన్ కు సోమవారం తీసుకువచ్చారు. ఇద్దరు అన్నదమ్ముల తండ్రి ఎర్రన్న మృతి చెందగా.. తల్లి సారక్క జైలులో ఉంది. మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో ఆ ఇద్దరు అన్నదమ్ములు వారి వివరాలను ఇలా చెబుతున్నారు.
చిన్నారులది మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామం అని తెలిపారు. వారి పేర్లు రావుల మనోజ్, రావుల మధు అని చెప్పారు. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారని పోలీసులు ప్రశ్నించగా.. తమ తండ్రి మృతి చెందాడని, తల్లి జైలులో ఉందని, ఏం చేయాలో తెలియక ఎవరూ లేక ఇలా బయట తిరుగుతున్నామన్నారు. దీంతో మాక్లూర్ పోలీస్ స్టేషన్లోనే పోలీసులు ఆ ఇద్దరు అన్నదమ్ములైన చిన్నారులను ఉంచి, ఆ చిన్నారులకు ఎవరైనా సమీప బంధువులు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు.