Laptop on lap : ల్యాప్‌టాప్‌ను అలా వాతున్నారా?.. ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే!

by Javid Pasha |   ( Updated:2025-01-06 15:33:40.0  )
Laptop on lap : ల్యాప్‌టాప్‌ను అలా వాతున్నారా?.. ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే!
X

దిశ, ఫీచర్స్ : సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితంలో ఎన్నో మార్పులను తెచ్చింది. ఒకప్పటితో పోలిస్తే మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ వంటివి అందుబాటులోకి వచ్చాక ప్రతీ పని ఈజీ అవడమే కాకుండా, కంఫర్టుగానూ మారింది. అయితే ఇక్కడే తెలిసో, తెలియకో చేసే కొన్ని పొరపాట్లు నష్టాలు కూడా తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ వాడకంపై అవగాహనలేమి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అలాంటి వాటిలో ల్యాప్‌టాప్ కాళ్లమీద లేదా ఒడిలో పెట్టుకొని వర్క్ చేయడం కూడా ఒకటి. ఇలా చేసేవారిలో పలు హెల్త్ ఇష్యూస్ తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.

* మెడ, వెన్నునొప్పి : ఈ రోజుల్లో ఐటీ సెక్టార్ సహా పలు సంస్థల్లో వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేసేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. వీరు ఎక్కువగా ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తుంటారు. కార్యాలయాల్లో కూడా కొందరు ల్యాప్‌టాప్ వాడుతుంటారు. అయితే వర్క్‌ఫ్రమ్ చేసేవారిలోనే చాలా మంది సాధారణంగా చేసేపొరపాటు ఏంటంటే.. ల్యాప్‌టాప్‌ను కాళ్లమీద పెట్టుకొని పని చేస్తుంటారు. ఈ సందర్భంగా ఎక్కువసేపు స్ర్కీన్ వైపు తలవంచడం, కూర్చునే భంగిమ సక్రమంగా లేకపోవడం వంటి కారణాలతో మెడ, వెన్నెముక, కాళ్లపై ఒత్తిడి పడుతుందని, అది దీర్ఘకాలిక మెడ, వెన్ను నొప్పులకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సో.. ల్యాప్‌టాప్ వాడేవారు కేర్ తీసుకోవాలని, కాళ్లమీద కాకుండా టేబుల్‌పైన పెట్టి యూజ్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. స్టాండింగ్ డెస్క్‌ను యూజ్ చేస్తే అలాంటి సమస్యలకు అవకాశం ఉండదు.

*సంతానలేమి సమస్యలు : ఎక్కువకాలం ల్యాప్‌టాప్ వాడుతున్నవారు తరచుగా కాళ్లమీద పెట్టుకొని వర్క్ చేస్తుంటే గనుక సంతానలేమి సమస్యలకు దారితీయవచ్చు. దాని టెంపరేచర్ కారణంగా మహిళల్లో అయితే ఎగ్ రిలీజ్‌పై, పురుషుల్లో అయితే స్పెర్మ్ కౌంట్ నాణ్యతపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

* దృష్టిలోపాలు, తలనొప్పి : ల్యాప్‌టాప్ కాళ్లపై పెట్టుకొని వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువ సమయం తల కిందకు వంచి చూడాల్సి వస్తుంది. ఇది తల, కంటి నరాలపై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో దృష్టిలోపాలు, తలనొప్పి, మైగ్రేన్ వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి దీర్ఘకాలికంగా ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని పనిచేస్తున్నట్లయితే వెంటనే మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

*స్కిన్ క్యాన్సర్ : ల్యాప్‌టాప్ కాళ్లమీద పెట్టుకొని వర్క్ చేస్తున్నప్పుడు అది వేడెక్కడంవల్ల చర్మంపై దాని ప్రభావం పడుతుంది. దీర్ఘకాలంపాటు అదే కొనసాగితే చర్మంపై దురద, దద్దుర్లు, స్కిన్ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

*అలర్జీలు, డీహైడ్రేషన్ : ల్యాప్ టాప్ వేడివల్ల చర్మంపై చెమట రావడం, డీహైడ్రేషన్ ఏర్పడటం, అలర్జీలు కలగడం వంటివి జరగవచ్చు. అట్లనే ల్యాప్‌టాప్‌కు బయటి నుంచి సరైన గాలి తగలకపోవడంవల్ల దాని ఎలక్ట్రానిక్ విధుల్లో లోపాలకు, ప్రతికూలతలకు దారితీస్తుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ల్యాప్‌టాప్ స్టాండ్‌ను ఉపయోగించాలి. అట్లనే మీ తల లేదా కళ్ల భాగానికి సమానమైన ఎత్తులో ల్యాప్‌టాప్ ఉండేలా టేబుల్‌పై లేదా స్టాండ్‌పై పెట్టుకొని వర్క్ చేస్తే బెటర్. ల్యాప్‌టాప్ వేడెక్కకుండా కూలింగ్ ప్యాడ్ వాడితే మంచిది. ఒకే పొజిషన్‌లో ఎక్కువసేపు కూర్చొని పనిచేయకుండా ప్రతీ 20 నిమిషాలకోసారి ఒక నిమిషం బ్రేక్ తీసుకొని కంఫర్టబుల్ చైర్‌లో కూర్చోవడమో, నడవడమో చేయాలి.

Read More...

Nail Polish: వామ్మో.. ఈ నెయిల్ పాలిష్ ధర అక్షరాలా కోటి రూపాయలు.. దీని స్పెషల్ తెలిస్తే వావ్ అనాల్సిందే




Advertisement

Next Story