India Slams Pakistan: పొరుగు దేశాలను నిందించడం పాక్‌కు అలవాటు

by Shamantha N |
India Slams Pakistan: పొరుగు దేశాలను నిందించడం పాక్‌కు అలవాటు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమాయక పౌరులపై దాడి జరిగితే భారత్ నిస్సందేహంగా ఖండిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అఫ్గాన్ పై పాక్ వైమానిక దాడుల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్(Foreign Ministry's Spokesperson Randhir Jaiswal) స్పందించారు. అఫ్గానిస్థాన్(Afghanistan) పై (Pakistani attack ) చేపట్టిన వైమానిక దాడిని భారత్ తీవ్రంగా తప్పుట్టారు. పొరుగు దేశాలను నిందించడం పాక్‌కు అలవాటే అని చురకుల అంటించారు. తమ అంతర్గత వైఫల్యాలను పాక్ పొరుగు దేశాలపైనే రుద్దుతోందని అన్నారు. ఈ అంశంపై అఫ్గాన్‌ అధికార ప్రతినిధి మాట్లాడిన విషయం కూడా విదేశాంగశాఖ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. కాగా..డిసెంబరు 26న అఫ్గానిస్థాన్ తూర్పు పక్తికా ప్రావిన్స్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 46 మంది పౌరులు చనిపోయారు. వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. "ఈ క్రూరమైన చర్యను అన్ని అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించడం, స్పష్టమైన దూకుడు చర్యగా ఆఫ్గానిస్థాన్ పరిగణిస్తుంది" అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖౌరాజ్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఈ పిరికిపంద చర్యకు సమాధానం ఇవ్వకుండా వదిలిపెట్టదని హెచ్చరించారు. కాగా.. ఈ విషయంపైనే భారత్ స్పందించింది. పాక్ తీరుని తప్పుబట్టింది.

Advertisement

Next Story