గుర్తు తెలియని వ్యక్తి మృతి

by Naveena |
గుర్తు తెలియని వ్యక్తి మృతి
X

దిశ,గరిడేపల్లి : గరిడేపల్లి మండల పరిధిలోని అప్పన్నపేట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. బిక్షం అడుక్కుంటూ పది రోజుల క్రితం అనారోగ్యంతో కింద పడిపోయి ఉంటే..108 వాహనంలో హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పది రోజులు ట్రీట్మెంట్ జరుగుతూ బుధవారం చనిపోయినట్లుగా ఎస్సై చలి కంటి నరేష్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 48 సంవత్సరాలు, ఆరడుగుల ఎత్తు ఉన్నాడు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే గరిడేపల్లి పోలీస్ స్టేషన్ నెంబర్ 871268 6053 సంప్రదించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed