- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ(BJP)పార్టీ 29మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల(First List of Candidates) చేసింది. ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ పై బీజేపీ నుంచి పర్వేష్ సింగ్ వర్మ పోటీ చేయనున్నారు. అలాగే సీఎం అతిషి పై రమేష్ బిదూరి పోటీ చేయనున్నారు. బీజేపీ తొలి జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. ఢిల్లీ యూనివర్సిటీ నాయకురాలు రేఖా గుప్తా, సుశ్రి కుమారి రింకూలకు బీజేపీ తొలి జాబితాలో అవకాశమిచ్చింది. అయితే ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవ్ పేరు తొలి జాబితాలో లేకపోవడంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయబోరన్న ప్రచారం వినిపిస్తుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ' ఇప్పటికే మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 2015 నుంచి ఢిల్లీలో ఆప్ అధికారంలో కొనసాగుతోంది. మరోసారి అధికారంలో కొనసాగేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఢిల్లీ పీఠం ఈసారి కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉన్నాయి. అయితే 2014 నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీ 7 లోక్‌సభ సీట్లను గెలుచుకుని ఊపు మీద ఉంది. ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.