- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలో చైనా కొత్త వైరస్ కేసులు.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..?
దిశ, వెబ్ డెస్క్: చైనా దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న HMPV వైరస్ కేసులు.. సోమవారం భారత దేశంలో కూడా గుర్తించబడ్డాయి. దీనిని ఐసీఎమ్ఆర్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ వైరస్ సోకిన ముగ్గురు సంవత్సరం లోపు చిన్నారులే కావడం విశేషం. ఇదిలా ఉంటే hmpv వైరస్ పాజిటివ్ గా తేలిన ముగ్గురు చిన్నారులకు ఎటువంటి విదేశీ ప్రయాణం చేయలేదు. అయినప్పటికి వారికి చైనాకు చెందిన ఈ వ్యాధి రావడంతో దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చైనాలో కనుగొనబడిన ఈ వైరస్, మలేషియా, హాంకాంగ్, జపాన్, తాజాగా భారత్ కు వ్యాప్తి చెందింది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.
హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ లక్షణాలు
హెచ్ఎంపీవీ (HMPV) వైరస్‌ని 2001లోనే గుర్తించిన గుర్తించారు. ఆ వైరస్ లక్షణాలు (HMPV virus Symptoms) ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియా కు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ అని పేర్కొంది.
ఈ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు వెంటనే వారికి షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్ చేయించాలి.
* ఎవరైనా పిల్లలను ఎత్తుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
*నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను చిన్న పిల్లను తీసుకెళ్లకూడదు.
*ఇంటి నుంచి బయటకు వెళ్లిన పెద్దలు క్లీన్ గా ఉండేందుకు ప్రయత్నించండి,
*పిల్లల పాల డబ్బాలు, ఆట బొమ్మలు, దుస్తులు, ఇతర వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
*ముఖ్యంగా పిల్లలకు ఇమ్మునిటి పవర్ ను పెంచె బ్రెస్ట్ ఫీడింగ్ కచ్చితంగా ఇవ్వాలి.
*పిల్లలకు పాలు ఇచ్చి వదిలేయకుండా.. వారికి నీరు కూడా అందించిన వారిని హైడ్రెడ్ గా ఉంచాలి.
*అలాగే కొంతకాలం పాటు ఇతరులను తమ ఇంట్లోకి రానీయకుండా ఉండటం మంచిది.