Amaravati: ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ పశ్నల వర్షం

by srinivas |
Amaravati: ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ పశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. కాకినాడ సెజ్, సీ పోర్టు లిమిటెడ్ షేర్ల బదలాయింపు వ్యహారంలో ఆయన విచారణకు హాజరయ్యారు. దీంతో అధికారులు మూడు గంటలుగా విచారిస్తున్నారు. షేర్లు, నగదు బదిలీపై విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ విరామం తీసుకున్నారు. అనంతరం విజయసాయిరెడ్డిని అధికారులు మళ్లీ విచారించనున్నారు.

కాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గత ప్రభుత్వంలో కాకినాడ సెజ్, సీ పోర్టు లిమిటెడ్ వాటాలను బలవంతంగా లాక్కున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐడీ కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇందులో భాగంగా విచారణకు హాజరుకావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు.

Advertisement

Next Story