Telangana Police Case: మోహన్ బాబు అప్పీల్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్...

by srinivas |   ( Updated:2025-01-06 10:10:32.0  )
Telangana Police Case: మోహన్ బాబు అప్పీల్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్...
X

దిశ, వెబ్ డెస్క్: నటుడు మంచు మోహన్ బాబు(Actor Mohan Babu) విజ్ఞప్తికి సుప్రీంకోర్టు(Supreme Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్యామిలీ వివాదంలో జరిగిన ఘటనలపై హైదరాబాద్ జల్ల పల్లిలో మోహన్ బాబుపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగింది. అయితే మోహన్ తరపున వాదించే సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి అందుబాటులో లేక పోవడంతో విచారణపై పాస్ ఓవర్ కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. దీంతో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

కాగా ఆస్తుల విషయంలో ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొంది. తండ్రి మోహన్ బాబు ఆస్తుల కోసం తనయులు మంచు విష్ణు(Manchu Vishnu), మనోజ్(Manoj) మధ్య పెద్ద పంచాయతీనే జరిగింది. జల్లపల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నం చేశారు. దీంతో మనోజ్‌ను మంచు విష్ణు అనుచరులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ జరిగింది. అయితే ఈ వివాదంపై న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో మంచు మోహన్ బాబుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Next Story