Minister Ponguleti: మొదట్లో కాలు విరిగింది.. మరి ఇప్పుడేమైంది: కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి సెటైర్లు

by Shiva |   ( Updated:2025-01-06 09:14:40.0  )
Minister Ponguleti: మొదట్లో కాలు విరిగింది.. మరి ఇప్పుడేమైంది: కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ (KCR)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత ఫామ్ హౌజ్‌కే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ (Assembly)కి రమ్మంటే మొదట్లో కాలు విరిగిందని అన్నారని.. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాలు కూడా హాజరు కాలేదని.. మరి ఆయనకు ఇప్పుడు ఏమైందని సెటైర్లు వేశారు. గత ప్రభుత్వం ‘ధరణి’ (Dharani) పేరుతో విచ్చలవిడిగా భూములను కొల్లగొట్టిందని ఫైర్ అయ్యారు. లక్షలాది మంది రైతుల తమ భూములు కోల్పోయి గగ్గోలు పెడుతున్నా ఆనాడు ఇదే బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక ‘ధరణి’ (Dharani)ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు. ఐదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పింక్‌ కలర్‌ షర్ట్‌ వేసుకున్న వారికే డబుల్ బెడ్ రూం ఇళ్లు (Double Bedroom Houses) ఇచ్చారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కనుమరుగు అవడం ఖాయమని మంత్రి పొంగులేటి అన్నారు.

Advertisement

Next Story