Black leopard:ఆ అడవుల్లో అరుదైన నల్ల చిరుత.. కూనతో కలిసి హల్‌చల్ (వీడియో వైరల్)

by Jakkula Mamatha |   ( Updated:2025-01-04 12:29:27.0  )
Black leopard:ఆ అడవుల్లో అరుదైన నల్ల చిరుత.. కూనతో కలిసి హల్‌చల్ (వీడియో వైరల్)
X

దిశ,వెబ్‌డెస్క్: అడవుల్లో ఎన్నో రకాల జంతువులు దర్శనమిస్తుంటాయి. అయితే అడవి(forest)లో జంతువులు చేసే చేష్టలు చూస్తుంటే భలే సరదాగా అనిపిస్తుంటుంది. ఈ క్రమంలో కొందరు టీవీలో డిస్కవరీ ఛానల్(Discovery Channel) పెట్టుకుని జంతువుల(animals) విన్యాసాలు చూస్తూ ఆనందిస్తారు. కొండచిలువ, అనకొండ లాంటి పాములు ఎలా జంతువులపై దాడి చేసి తినేస్తాయో వంటి దృశ్యాలు కూడా చూస్తుంటాం. కొన్ని జంతువులు ఐక్యమత్యంగా ఉండడం, జంతువులు నేర్పే నీతి కథలను కూడా పిల్లలు చూస్తుంటారు. అసలు విషయంలోకి వెళితే.. ఒడిశా అడవుల్లో అత్యంత అరుదైన నల్ల చిరుత (బ్లాక్ పాంథర్) సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఈ నల్ల చిరుత(black leopard)లు ఒడిశా(Odisha) అడవుల్లో కేవలం మూడు ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిరుత నాయాగఢ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో కెమెరాకు చిక్కిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రేమ్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సెంట్రల్ ఒడిశాలో అత్యంత అరుదుగా నల్ల చిరుతలు కనిపిస్తాయని చెప్పారు. జంతువుల కదలికలను, వాటి సంఖ్యను గుర్తించేందుకు అమర్చిన ట్రాప్ కెమెరాల్లో ఈ బ్లాక్ పాంథర్ కనిపించిందని, బిడ్డను నోటకరిచి తీసుకెళ్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయని తెలిపారు. ఆ నల్ల చిరుత కూనతో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా అవుతోంది.

Advertisement

Next Story