- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Food Safety: కేక్ తయారీలో ఆల్కహాల్ (రమ్).. బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ దాడుల్లో విస్తుపోయే నిజాలు
దిశ, డైనమిక్ బ్యూరో: గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల (Food safety officials) దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్, అల్వాల్ పరిధిలోని పలు బేకరీ (bakery) షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్ ఖర్ఖానలోని ఓ బేకరిలో ఎక్సైజ్ అనుమతి లేకుండా ప్లం కేక్‌లను సిద్ధం చేయడానికి (Alcohol) ఆల్కహాల్ (రమ్) ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు ప్లమ్ కేకులో ఆల్కహాల్ ఉపయోగించినట్లు లేబుల్‌పై కూడా లేదని తెలిపారు. కేక్ తయారీలో ఉపయోగించే పాత్రలు అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. కేకుల్లో ఉపయోగించే డ్రై ఫ్రూట్స్, జామ్‌లను కలిపి గుజ్జును పెద్దమొత్తంలో తయారు చేసి ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ గుజ్జును ఎన్ని నెలలు నిల్వ ఉంచారు.. ఎన్ని రోజులకు వాడుతారనేది తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నిబంధనలు ఉల్లంగించారు. కెమికల్స్, నాన్ వెజ్ ఫుడ్ ఆర్టికల్స్ వంటి వస్తువులు, ఇతర వస్తువులు అన్ని ఒకే చోట ఉన్నట్లు గుర్తించారు.
అదేవిధంగా అల్వాల్ ప్రాంతంలోని ఓ కేక్ షాపులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు పాటించడం లేదు. కేక్‌ల తయారీలో ఉపయోగించే అచ్చు పాత్రలు చాలా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. నిల్వలో అనేక చోట్ల ఎలుకల మలం, తయారీ యూనిట్‌లోని అనేక చోట్ల ప్రత్యక్ష బొద్దింక ముట్టడిని గమనించారు. కోల్డ్ రూమ్‌లోని ఏసీ లీక్ అవడం వల్ల గదిలోని ట్రేలలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు కలుషితమవుతున్నట్లు గుర్తించారు. కేసర్ సిరప్, ఫ్లేవర్స్ లాంటి అనేక గడువు ముగిసిన ఉత్పత్తులు ప్రాంగణంలో కనుగొన్నారు. రిఫ్రిజిరేటర్లు ఆహార వ్యర్ధాలను చెత్తతో అపరిశుభ్రంగా ఉన్నాయి. అనేక ఆహార పదార్థాలను అపరిశుభ్రమైన ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు.