చైనా మంజా విక్రయించినా, వినియోగించినా చర్యలు

by Sridhar Babu |
చైనా మంజా విక్రయించినా, వినియోగించినా చర్యలు
X

దిశ, గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైనా మంజా పై నిషేధం ఉందని, ఎవరైనా వాటిని అమ్మినా, వినియోగించినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ హెచ్చరించారు. సంక్రాంతి సంద‌ర్భంగా చైనా మంజా ఎక్కువ‌గా విక్ర‌యించే దుకాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నైలాన్, సింథటిక్‌ దారాలతో తయారు చేసే ఈ చైనా మంజాలతో పర్యావరణానికి హాని ఉందన్నారు. ఎన్నో ప‌క్షులు, ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని వివరించారు. చైనా మంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తామన్నారు.

Advertisement

Next Story