రోగులకు మెరుగైన సేవలు అందించాలి : దుబ్బాక ఎమ్మెల్యే

by Aamani |
రోగులకు మెరుగైన సేవలు అందించాలి : దుబ్బాక ఎమ్మెల్యే
X

దిశ,చేగుంట : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి మన్ననలు పొందాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి నూతనంగా మంజూరైన 108 అంబులెన్స్ ను సోమవారం వైద్య సిబ్బందితో, మాజీ ప్రజా ప్రతినిధులు కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందితో కలిసి సేవా విభాగాలను పరిశీలించారు. 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆసుపత్రి ఉన్నందున అనేక రకాల రోగులు వస్తుంటారని ప్రమాదాలు జరిగి క్షతగాత్రులు వస్తున్నందున వారందరికీ త్వరితగతిన వైద్య సహాయం అందించాలని సూచించారు.

కాబట్టి ఈ అంబులెన్స్ సర్వీస్ వినియోగించుకోవాలని సూచించారు. నార్సింగ్ మండల కేంద్రంలోని ఆసుపత్రి ఇంకా అనేక రకాలైనటువంటి సేవలను అందించాలని, ప్రభుత్వపరంగా ఈ ఆసుపత్రికి మరింత సిబ్బందిని పెంచాలని, ఆస్పత్రిలో ఎలాంటి చికిత్స కైనా ఏర్పాట్లు ఉండే విధంగా ఆస్పత్రి సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆస్పత్రిలో పలు రకాల చికిత్సలు సంబంధించిన పరికరాలను గాని, స్పెషలిస్ట్ లను గాని త్వరలోనే ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ పీహెచ్సీ ని భవిష్యత్తులో ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా మనందరం కలిసి దీన్ని తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అనంతరం ఆస్పత్రి రికార్డులను పరిశీలించి ఆస్పత్రికి కావలసిన ఇంకా ఇతర సదుపాయాలను జిల్లా వైద్యాధికారులు ఒక నివేదికను తయారు చేయాల్సిందిగా ఆదేశించారు.

జాతీయ రహదారిపై ఉన్న ఈ ఆసుపత్రిని ఒక గొప్ప ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి అందరం కంకణ బద్ధులం కావాలని, ఆసుపత్రికి వచ్చే రోగులతో సహృదయంతో వారికి సేవలు అందించి జిల్లాలోనే ఒక మంచి ఆసుపత్రిగా దీని నిలబెట్టాలని అక్కడ ఉన్న సిబ్బందికి సూచించారు.ఈ 108 అంబులెన్స్ సర్వీస్ ను నార్సింగ్ మండల ప్రజలే రాకుండా జాతీయ రహదారిపై ప్రయాణించే వారు వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నార్సింగ్ తహసీల్దార్ కరీం, ఎంపీడీవో ఆనంద్, మాజీ ఎంపీపీ సబితా, మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు, చేగుంట మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం గౌడ్, నార్సింగి పట్టణ శాఖ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూపతి రాజు, నరేష్ తో పాటు వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story