Rythu Bharosa: వారందరికి రైతు భరోసా కట్..! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

by Prasad Jukanti |
Rythu Bharosa: వారందరికి రైతు భరోసా కట్..! ప్రభుత్వం సంచలన నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు భరోసా (Rythu Bharosa) అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి పండగ కానుకగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ స్కీం అమలు కోసం అవసరమైన విధివిధానాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ప్రతిపాదించింది. అవకతవలకు ఆస్కారం లేకుండా, అనర్హులకు ఫలాలు చేరకుండా ఈ స్కీమ్‌ను పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రైతుభరోసా పెట్టుబడి సాయం అర్హుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం మాదిరిగా దుబారా చేయకుండా పకడ్బందీగా అమలు చేస్తూ అసలైన సాగుదారులకే రైతుబంధు అందజేసే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రైతుభరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఐఏఎస్, ఏపీఎస్‌లకు సైతం రైతు భరోసా కట్ (Rythu Bharosa Cut) చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ఇవాళ జరగబోయే మంత్రి మండలి సమావేశంలో రైతు భరోసా విధివిధానాలను ఫైనల్ చేయబోతున్నట్లు టాక్.

పక్కాగా విధివిధానాలు అమలు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాళ్లు, రప్పలతో పాటు సాగులో లేని భూములకు, సొంత పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేలా రైతుబంధు స్కీమ్‌ను అమలుచేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల శాసనసభలో ఆరోపించారు. ఇటువంటి పరిస్థితి రాకుండా పక్కాగా అమలుకు సర్కార్ విధివిధానాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వ్యవసాయేతర భూములకు పెట్టుబడి సాయం అందించడం, అనర్హులకు ఆయాచిత లబ్ధి చేకూర్చడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ప్రతిపక్షాలకు షాకిచ్చేలా సర్కార్ డెసిషన్!

రైతు భరోసాను అమలు చేసేందుకు సర్కార్ తుదిమెరుగులు దిద్దుతున్న క్రమంలో ఈ స్కీమ్ చుట్టూ రాజకీయ దుమారం రేపుతోంది. సంక్రాంతికి రైతులకు బోనాంజా ప్రకటించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉండగా.. రకరకాల కండిషన్లతో రైతుభరోసా ఎగ్గొట్టాలని ప్రభుత్వం చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైతు భరోసా కోరుకునే రైతులు ప్రమాణ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పడం సిగ్గుమాలిన చర్య అని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శిస్తే, రైతు భరోసాపై కొర్రీలు సరికాదని కేంద్రమంత్రి, బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ధ్వజమెత్తారు. దీంతో రైతుభరోసాపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధం నడుస్తున్నది. ఇవాళ జరగబోయే కేబినెట్ సమావేశంలో తుదినిర్ణయం తీసుకునే వరకు ఓపిక పట్టాలని, మంత్రి మండలి సమావేశంలో సీఎం రైతుభరోసాపై ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. దీంతో రైతుభరోసాపై కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నది.. ప్రతిపక్షాల విమర్శలకు ఎలా చెక్ పెట్టబోతున్నది.. ఈ స్కీమ్‌ను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు ఎలాంటి ప్రతిపాదనలను ఫైనల్ చేసిందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది.

Advertisement

Next Story