కేరళ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి

by Naveena |
కేరళ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి
X

దిశ, కామారెడ్డి : నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్పేట్ గ్రామంలో ఉన్న కేరళ పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకొని పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని భారతీయ విద్యార్థి మోర్చ నాయకులు సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ మాట్లాడుతూ..విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ..మౌళిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. ఫీజులు కట్టకపోతే ఇష్టానుసారంగా,దౌర్జన్యంగా దాడి చేసి వాతలు వచ్చే విధంగా కొడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఇదే విధంగా జరిగితే జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయగా..నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోలేక పోయారన్నారు. మండల విద్యా శాఖ అధికారి ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో..యాజమాన్యం విద్యార్థులను బెదిరింపులకు పాల్పడుతూ విద్యాను వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రేకుల షెడ్ లో పాఠశాలను నడుపుతూ సరైన సౌకర్యాలు లేకుండా ఒక్క రూమ్ లో 80 నుంచి 100 మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కేరళ పాఠశాల గుర్తింపు ను రద్దుచేసి యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యశ్వంత్, జిల్లా నాయకులు శ్రవణ్, అభిలాశ్, శ్రేయస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story