Karthika Deepam : పెద్దలను గౌరవించడం నేర్చుకో అంటూ జ్యోకి వార్నింగ్ ఇచ్చిన సుమిత్ర

by Prasanna |
Karthika Deepam : పెద్దలను గౌరవించడం నేర్చుకో అంటూ జ్యోకి వార్నింగ్ ఇచ్చిన సుమిత్ర
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

ఇంకోవైపు జ్యో.. తాతను, తండ్రిని కూర్చోబెట్టుకుని.. ‘రెస్టారెంట్ సీఈవోగా నేను కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ముందులాగా వచ్చినట్టు ప్రాఫిట్ రావడం లేదు. మొత్తం తగ్గిపోయింది. అలాగే, ఉద్యోగులకు కూడా ఇంకా సాలరీస్ ఇవ్వలేదు’ అంటూ అన్నీ చెబుతుంది. నువ్వు ఏదైనా చెయ్.. నీ వెనుక నేను ఉంటా ’ అని తాతా అంటాడు. దాంతో జ్యో సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ‘చిన్న పిల్లల మీద నీకెందుకు నాన్న అంత బాధ్యత ?’ అని దశరథ్ అంటాడు. ‘వాళ్లను నేర్చుకోనివ్వాలి’ అని శివనారాయణ అంటాడు. ఆ తర్వాత, ఉదయాన్నే దాసు ఇంటికి వస్తూ ఉంటాడు. కానీ, జ్యో అడ్డుపడుతుంది. నన్ను కొంచం ప్రశాంతంగా ఉండనివ్వవా నాన్నా?’ అని జ్యో కోపంగా అరుస్తుంది.

ఇంతలో సుమిత్ర మంచిగా రెడీ అయ్యి.. శివనారాయణ దగ్గర పర్మిషన్ తీసుకుని గుడికి అని చెప్పి అక్కడి నుంచి దీప దగ్గరకు వెళ్తుంది. అయితే, బయటికొచ్చేసరికి.. దాసుతో జ్యో పెద్ద గొడవ పడుతుంది. ‘నువ్వు ఆ దీప గురించి నిజం చెప్తే .. నేను నా తల్లి దగ్గరకే వెళ్తాను. అప్పుడు నీ భార్య నిన్ను ఎప్పటికీ క్షమించదు’ అంటూ బెదిరిస్తూనే.. ‘నువ్వు వెళ్లిపో’ అని అంటుంది. దూరంగా నిలుచున్న సుమిత్ర.. అసలు ఆయనెందుకు వెళ్లిపోవాలి? ఆయన నీకు బాబాయ్ కదా అని అంటుంది.. ముందు పెద్దలను గౌరవించడం నేర్చుకో?’ అంటూ జ్యోని, సుమిత్ర బాగా తిడుతుంది.

Advertisement

Next Story