- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Prajadarbar: సమస్యల పరిష్కారంలో నారా లోకేష్ నూతన ఒరవడి
దిశ, వెబ్ డెస్క్: ప్రజా పాలనలో మంత్రి నారా లోకేష్(minister Nara Lokesh) తనదైన ముద్ర వేస్తున్నారు. సమస్యల పరిష్కారంలో నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉండవల్లి నివాసంలో 53వ రోజులుగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రజాదర్బార్‌కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. గ్రామ, పట్టణాల నుంచి వచ్చి తాము ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా మంత్రికి విన్నవించుకుంటున్నారు. అర్జీలు సమర్పిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న మంత్రి.. సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు. పింఛన్ల సహా పలు సమస్యలపై వెంటనే బాధితులకు పరిష్కారం చూపుతున్నారు. అలాగే వారికి అన్ని విధాలుగా అండగా నిలబడుతూ భరోసా ఇస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రజాదర్బార్ నిర్వహిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నాను. ఉండవల్లిలోని నివాసంలో 53వ రోజు ప్రజాదర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నన్ను కలిసి అర్జీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరి… pic.twitter.com/T1x4FmdgDa
— Lokesh Nara (@naralokesh) January 4, 2025