- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
దిశ,పటాన్ చెరు : క్రీడలు దినచర్యలో భాగం కావాలని, క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో నూతన సంవత్సరం సందర్భంగా నిరంజన్ ఎలెవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 31స్ట్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎంఎల్ఏ జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. పటాన్ చెరు నియోజకవర్గంలో క్రీడారంగ అభివృద్ధికి పెద్దపీట వేయడం తో పాటు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
వీటితోపాటు పటాన్ చెరు, అమీన్ పూర్, జిన్నారం లలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో మినీ స్టేడియం నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జాతీయ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు సైతం సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. గత 17 సంవత్సరాలుగా యువత కోసం 31 నైట్ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు అనంతరం విజేతలుగా నిలిచిన నిరంజన్ 11, నిలిచిన కేబీఎన్ జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు.