Thalasani: మాజీ మంత్రి తలసానికి బిగ్ షాక్.. నోటీసులు జారీ

by Shiva |   ( Updated:2025-01-04 08:55:56.0  )
Thalasani: మాజీ మంత్రి తలసానికి బిగ్ షాక్.. నోటీసులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రేవంత్ సర్కార్ (Revanth Government) బీఆర్ఎస్ (BRS) నేతలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విచారణకు కూడా ఆదేశించింది. అధికారంలో లేకపోయినా ప్రభుత్వ వనరులను దర్జాగా వాడుకుంటోన్న కొందరిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ (Talasani Srinivas Yadav)‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ మేరకు ఆదర్శ్‌నగర్ (Adarsh Nagar) ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని షాప్ నెంబర్ 8‌లో ఉన్న వెజిటెబుల్ షాప్‌ను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు ఇవాళ నోటీసులు జారీ చేశారు. అయితే, తనకు నోటీసులు అందిన విషయంపై తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకా స్పందించ లేదు.

Advertisement

Next Story