- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు యువకుల అరెస్ట్
దిశ, బడంగ్ పేట్ : చైన్ స్నాచింగ్‌కు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు యువకులను పహాడీషరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి మూడు తులాల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ... గత డిసెంబర్ 30వ తేదీన ముచ్చ కాకుల సరస్వతి (56) గత డిసెంబర్ 30వ తేదీన రాత్రి 9.30గంటలకు కిరాణ దుకాణానికి వెళ్ళింది. మార్గ మధ్యలో హీరో హోండా యాక్టివా బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సరస్వతి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు. దీంతో బాధితురాలు సరస్వతి పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసును నమోదు చేసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలం పరిసర ప్రాంతాలలోని సీసీ కెమెరాలను పరిశీలించి చైన్ స్నాచింగ్‌కు పాల్పడింది తుక్కుగూడ లక్ష్మీనగర్ కాలనీకి చెందిన గజ్జెల్లి వశిష్ఠ (19) ,బొగ్గుల అభిలాష్ (19) లుగా గుర్తించారు. వీరిద్దరు ఫ్యాబ్సిటీలోని రెనోసీస్ కంపెనీలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. వీరు గంజాయి, మద్యం, సిగరెట్ వంటి చెడు అలవాట్లకు భానిసయ్యారు. వీరి సంపాదన సరిపోక పోవడంతో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళ మెడలో నుంచి బంగారు చైన్లను దోపిడీ చేయాలని పథకం పన్నారు. ఈ నేపధ్యంలోనే సరస్వతి మెడలోంచి వశిష్ట, అభిలాష్‌లు బంగారు గొలుసును కాజేసి పోలీసులకు పట్టుబట్టారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసు , హోండా యాక్టివా బైక్, ఒక సెల్‌ఫోన్‌తో పాటు జర్కిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.