వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి

by Naveena |
వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి
X

దిశ, కోదాడ : కోదాడ పట్టణంలోని వ్యభిచార గృహాలపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. నలుగురు మహిళ ఆర్గనైజర్లు ఇద్దరు విటులు ముగ్గురు బాధిత మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సీఐ రాము తెలిపిన వివరాల ప్రకారం..నమ్మదగిన సమాచారం మేరకు పట్టణంలోని నయనగర్ శ్రీమన్నారాయణ కాలనీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా..నయ నగర్ లో ఇద్దరు మహిళలు వ్యభిచార నిర్వాహకులు ఒక విటుడును,అలాగే శ్రీమన్నారాయణ కాలనీలో ఇద్దరు మహిళ ఆర్గనైజర్లు ఒక విటులును అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. నలుగురు మహిళ ఆర్గనైజర్లు ఇద్దరు విటులు ,ముగ్గురు బాధిత మహిళలు అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 6 మొబైల్ ఫోన్లు 1500 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు.

Advertisement

Next Story