- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కిస్తీలు కట్టలేక దంపతుల ఆత్మహత్య
దిశ, వరంగల్ బ్యూరో : వారానికి రెండు వందల కిస్తీలు కట్టలేక దంపతులు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఇది. భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) దంపతులు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు రిషి (14), జశ్వంత్ (12)లు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గ్రామాల్లో కొంతమంది మహిళలను గ్రూపుగా ఏర్పరిచి ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులు రుణాలిస్తుంటారు. కొద్ది నెలల క్రితం చందన సభ్యురాలిగా ఉన్న సంఘం సభ్యులంతా కలిసి రూ.2.50 లక్షల వరకు అప్పు తీసుకున్నారు.
దీనికి ప్రతి వారం రూ. 200 కిస్తీ కట్టాల్సి ఉంటుంది. వాళ్ల ఒత్తిడి వల్లే మనోవేదన ఆపై ఆత్మహత్య : కొన్నాళ్లు సక్రమంగానే చెల్లించినా భర్త, పిల్లలు అనారోగ్యాల బారిన పడడంతో చందన కొన్నాళ్లుగా కిస్తీలు కట్టలేకపోయింది. దీనిపై ఫైనాన్స్ యజమాని ఒత్తిడి చేయడంతో భార్యాభర్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చందన డిసెంబరు 6న గడ్డి మందు తాగగా ఇరుగుపొరుగు వారు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితిపై ఆందోళనతో దేవేందర్ అదే నెల 20న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చందన మంగళవారం మృతి చెందింది. సుమారు పది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.