- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Revanth Reddy: న్యూఇయర్ వేళ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశా నిర్ధేశం
దిశ, వెబ్ డెస్క్: నూతన సంవత్సరం(New Year) వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాంగ్రెస్ ఎమ్మెల్యేల(Congress MLAs)కు దిశా నిర్ధేశం చేశారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టులు(Progress Reports) తన వద్ద ఉన్నాయని, నేను మారాను.. మీరు కూడా మీ తీరు మార్చుకోవాలని సీఎం సూచించారు. నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టి కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని, కార్యకర్తలకు సమయం కేటాయించి వారి సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పారు. మును ముందు కాంగ్రెస్(Congress) లోకి వలసలు చాలానే ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికలే(Local Body Elections) చాలా కీలకమని అన్నారు. అందరూ సమన్వయంతో ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని, స్థానిక సంస్థల్లో సత్తా చాటి, తమ తమ నియోజకవర్గాలను మరింత బలోపేతం చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.