- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డ్రగ్స్ పై 19 టీమ్‌ల సెర్చ్ ఆపరేషన్...
by Aamani |
X
దిశ, సిటీ క్రైమ్ : కొత్త సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ మహమ్మారి ని తరిమి కొట్టేందుకు టీజీ న్యాబ్ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, ఎక్సైజ్, ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ పోలీసులతో పక్కా ప్రణాళికతో డిసెంబర్ 31 రోజుల తనిఖీలను చేపట్టింది. ఈవెంట్స్, ఫాంహౌజ్, రిసార్ట్స్, పబ్స్, ఇంకా ఇతర హాట్ స్పాట్ లలో డ్రగ్స్ కిట్స్ లతో పరీక్షలను నిర్వహించింది. మొత్తం 19 టీం లను రంగంలోకి దింపి తనిఖీలు చేయగా 5 గురు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. పలు ఈవెంట్స్, పబ్స్ లలో డిజె బృందాలను తనిఖీ చేయగా ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోలేదని తేలింది. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన ఐదుగురిని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. డక్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల పై సమాచారం ఉంటే టీజీ న్యాబ్ టోల్ ఫ్రీ 1908 కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
Advertisement
Next Story