‘కంచె చేను మేస్తే కాసేదెవరు’.. బాలికల కళాశాలలో లైంగిక వేధింపులు?

by Jakkula Mamatha |
‘కంచె చేను మేస్తే కాసేదెవరు’.. బాలికల కళాశాలలో లైంగిక వేధింపులు?
X

దిశ, ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండల పరిధిలో ఉన్న ఏపీఆర్‌జేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్‌ను చితకబాది, కళాశాల నుండి బాలిక ఇంటికి వెళ్ళిపోయిన సంఘటన చోటు చేసుకుంది. గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగస్తులు గా విధులు నిర్వహిస్తున్న లైబ్రేరియన్ మద్దిలేటి ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పట్ల వికృత చేష్టలతో మానసికంగా ఇబ్బంది పెట్టే వారు. అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస గుప్తాకు, మహిళా అధ్యాపకులకు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపాల్ శ్రీనివాస గుప్తాకు అధికార పార్టీకి చెందిన పెద్ద పెద్ద నాయకులతో సంబంధాలు ఉండడంతో ఎలాంటి స్పందన లేకపోవడంతో బాలిక తన తల్లిదండ్రులకు జరిగిన సంఘటన గురించి తెలిపింది.

విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల కు చేరుకుని జరిగిన విషయం తెలుసుకున్నారు. తమ బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రరీయన్‌కు దేహశుద్ధి చేశారు. అయితే ప్రిన్సిపల్ లైబ్రేరియన్‌కు పూర్తిగా సహకారం అందించడంతో, బాలిక తల్లి తండ్రి ఇక్కడ తమ కూతురికి రక్షణ లేదని భావించి కళాశాల నుంచి బాలికను ఇంటికి తీసుకు పోయారు. కానీ ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల తర్వాత గురువులకే అధిక ప్రాధాన్యం ఉన్నది అలాంటిది. కళాశాలలో హాస్టల్‌లో చదువుతున్న బాలికలకు రక్షణ కరువైందని, అలాంటిది దేశంలో రాష్ట్రంలో ఎంతటి కఠిన చట్టాలు అమలులో ఉన్న స్త్రీలకు, బాలికలకు రక్షణ కరువైందని తరచూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం చాలా బాధాకరమని తెలిపారు. ప్రజా సంఘాలు మరియు పాఠశాలల్లో మరియు కళాశాలలో చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులు మండిపడుతున్నారు, గతంలో కూడా లైబ్రరీ మద్దిలేటి, మరికొందరు పురుష సిబ్బంది విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి ఒక్కొక్కటి వస్తున్నాయి.

రెండు నెలల్లో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఉండడం, విద్యార్థి ఇంటికి వెళ్లిపోవడం విద్యార్థి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాక్టికల్స్ లో మీకు మార్కులు తక్కువ వేస్తాం. మేము చెప్పినట్లు మీరు వినకపోతే ప్రాక్టికల్స్ లో మీకు మార్కులు తక్కువ వేస్తాం, ఫెయిల్ చేస్తాం అంటూ విద్యార్థినీలను భయపెడుతూ.. విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ .. లైంగికంగా వేధిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మహిళా కళాశాలల్లో పురుషుల ఆదిక్యం ఎక్కువగా ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇదే కళాశాలలో అధిక శాతం సిబ్బంది పురుషులు ఉండటం, రాత్రి సమయాల్లో కళాశాలలోనే పురుష సిబ్బంది నిద్రిస్తుండడం, కొంతమంది సిబ్బంది బాలికలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కావున జిల్లా ఉన్నతాధికారులు ఏపీఆర్జేసీ బనవాసి కళాశాలలో జరుగుతున్న వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కళాశాలలో చదువుతున్న బాలిక తల్లిదండ్రులు భావిస్తున్నారు.

Advertisement

Next Story