- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడెం రెడీ.. ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి
దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి సాగునీరు అందించడంతోపాటు తాగునీటి అవసరాలు తీర్చే బహుళార్ధ ప్రాజెక్టు కడెం మరమ్మతులు పూర్తయ్యాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పలుసార్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టు రైతాంగం అనేక అవస్థలను ఎదుర్కొన్నది. అయితే ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రాజెక్టుపై పరిస్థితిపై పలుసార్లు నివేదించారు. ప్రాజెక్టు ప్రధాన ఆనకట్ట తెగిపోవడంతో పాటు పలుసార్లు గేట్ల మరమ్మతుకు సంబంధించి రైతాంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నది. అయితే ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు మంజూరు చేయడంతో మరమ్మతులు పూర్తయ్యాయి.
రూ .10 కోట్లతో మరమ్మత్తులు..
కడం ప్రాజెక్ట్ గేట్లకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి పలు గేట్లు మొరాయించడం తోపాటు... కొన్ని గేట్లు దిగకపోవడం, మరికొన్ని గేట్ల నుంచి నిరంతరం నీటి లీకేజీలు కొనసాగడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. వీటికి తోడు ప్రాజెక్టు మరమ్మత్తులు తీవ్రంగా ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 10 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో పూర్తిస్థాయిలో కాకపోయినా... వచ్చే సీజన్ కు సంబంధించిన రైతులు సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు పలు మరమత్తు పనులు చేపట్టారు. దీంతో ప్రాజెక్టు కింది ఆయకట్టుకు నీరు విడుదల చేసేందుకు మార్గం సుగమం అయింది.
జనవరి ఐదు నుంచి నీరు విడుదల...
కడెం ప్రాజెక్టు మరమ్మత్తులు పూర్తయిన నేపథ్యంలో జనవరి 5వ తేదీ నుంచి నీరు విడుదల చేసేందుకు ప్రాజెక్టు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నీరు విడుదల చేస్తే... ఖానాపూర్ నియోజకవర్గంలోని రెండు మండలాలతో పాటు దిగువన ఉన్న మంచిర్యాల జిల్లా వరకు సాగునీరు అందించేందుకు వీలుగా ఉంటుంది. దీంతో రైతాంగంలో హర్షం వ్యక్తం అవుతున్నది.