- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వింటాకు రూ. 10 వేలకు తగ్గకుండా పసుపుకు ధర చెల్లిస్తాం
దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 28: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు ఎండిన పసుపు తీసుకువస్తే క్వింటాకు రూ. 10వేలకు తగ్గకుండా ధర చెల్లిస్తామని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ ముప్పా గంగారెడ్డి పసుపు రైతులకు హామీ ఇచ్చారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో 2024-25 సీజన్ కు సంబంధించిన పసుపు కొనుగోళ్లను మార్కెట్ కమిటి చైర్మెన్ ముప్ప గంగారెడ్డి శనివారం ప్రారంభించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కిసాన్ మీటింగ్ హాల్ లో వ్యాపార వర్గాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే అధికారికంగా పసుపు సీజన్ ను చైర్మన్ గంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సీజన్ లో గతంలో కంటే పసుపుకు మంచి ధర లభిస్తుందన్నారు. రైతులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి డైరెక్టర్ మల్లేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణ, మార్కెట్ కమిటీ సభ్యులు లబాన్, శంకర్ దాస్, మధుసూధన్, మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.