AICC: అంత్యక్రియల్లో మన్మోహన్‌ను బీజేపీ అవమానించింది.. రాహుల్ గాంధీ

by Ramesh Goud |
AICC: అంత్యక్రియల్లో మన్మోహన్‌ను బీజేపీ అవమానించింది.. రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: అంత్య క్రియల(Funeral) సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former Prime Minister Manmohan Singh) ను బీజేపీ ప్రభుత్వం(BJP Government) అవమానించిందని(Insulted) ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC Leader Rahul Gandhi) అన్నారు. ఇవాళ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిగంబోధ్ ఘాట్ వద్ద జరిగాయి. దీనిపై ప్రతిపక్ష నేత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బీజేపీపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. భారతమాత ముద్దుబిడ్డ, సిక్కు సమాజానికి(Sikh community) మొదటి ప్రధాన మంత్రి అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఈరోజు నిగంబోధ్ ఘాట్(Nigambodh Ghat) వద్ద నిర్వహించడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ఆయనను పూర్తిగా అవమానించిందని ఆరోపించారు.

అలాగే ఆయన ఒక దశాబ్దం పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడని, ఆయన పదవీకాలంలో దేశం ఆర్థికంగా సూపర్ పవర్‌గా మారిందని, ఆయన విధానాలు ఇప్పటికీ దేశంలోని పేద, వెనుకబడిన తరగతులకు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. ఇక ఇప్పటి వరకు మాజీ ప్రధానులందరి గౌరవాన్ని గౌరవిస్తూ.. వారి అంతిమ సంస్కారాలు అధికారిక శ్మశానవాటికలో నిర్వహించబడ్డాయని, తద్వారా ప్రతి వ్యక్తి ఎటువంటి అసౌకర్యం లేకుండా చివరి చూపు చూసి, నివాళులు అర్పించారని అన్నారు. డా. మన్మోహన్ సింగ్ మన అత్యున్నత గౌరవం, స్మారకానికి అర్హుడని, దేశం గర్వించదగ్గ ఈ మహాపుత్రుడికి, ఆయన సమాజానికి ప్రభుత్వం గౌరవం చూపించి ఉండాల్సిందని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed