- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG Alert: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి నాలుగు రోజులు ఈ బ్యాంక్ సేవలు బంద్..!
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం(Central Govt) తెచ్చిన ఒకే రాష్ట్రం-ఒకే బ్యాంక్(One State-One Bank) నినాదం ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(APGV) బ్రాంచులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు(TGB)లో విలీనం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గత నవంబర్(November) లోనే టీజీబీ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 31 వరకు బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నట్లు టీజీబీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి(Pratap Reddy) ఓ ప్రకటనలో తెలిపారు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ATM వంటి డిజిటల్ బ్యాంకింగ్(Digital Banking) సేవలు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. జనవరి 1న తిరిగి సేవలను పునరుద్ధరిస్తామని, రెండు బ్యాంకులు విలీనం జరిగిన బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఛేంజ్(Change) కావని వెల్లడించారు. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారి అవసరాల నిమిత్తం ఈ నెల 30, 31వ తేదీల్లో రూ. 10,000 వరకు డబ్బు విత్ డ్రా(With Draw) చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.