Pawan Kalyan : అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే..!

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-28 16:22:10.0  )
Pawan Kalyan : అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌(Allu Arjun's Arrest)పై ఎదురైన ప్రశ్నకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రియాక్షన్ (Reaction) వైరల్ గా మారింది. కడప రిమ్స్ లో వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడి కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి అల్లు అర్జున్ అరెస్ట్‌పై మీ స్పందన ఏమిటని ప్రశ్నించారు. ఇది సంబంధం లేని ప్రశ్న అని సమాధానాన్ని దాటవేశారు.

మీ ఫ్యామిలీ మెంబర్ కదా అని మళ్ళీ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే మీరు సినిమాల గురించి మాట్లాటం ఏమిటని ఎదురు ప్రశ్నించారు. ఇంతకన్నా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించాలని..మీరు ఈ చర్చను సినిమావైపు మళ్లించకుండా వైసీసీ అరాచకం, దాడులపై పెట్టండని, పెద్ద మనసుతో ఆలోచించాలని పవన్ కల్యాణ్ మీడియాను కోరారు.

అల్లు అర్జున్ అరెస్టు పిదప ఇప్పటిదాక ఆయనను పవన్ కల్యాణ్ నేరుగా పరామర్శించలేదు. చిరంజీవి, నాగబాబు సహా మెగా కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ ను పరామర్శించినప్పటికి పవన్ కల్యాణ్ మాత్రం పరామర్శించకపోవడం..వివాదంపై స్పందించకపోవడం బన్నీ అభిమానులు అసంతృప్తికి గురి చేస్తుంది. బన్నీ అరెస్టుపై డిప్యూటీ సీఎం హోదాలో ఉండి స్పందించినట్లయితే లేనిపోని కొత్త సమస్యలకు అవకాశమిచ్చినట్లవుతుందన్న ఆలోచనతోనే పవన్ కల్యాణ్ ఈ వివాదంపై కామెంట్లకు దూరంగా ఉన్నారని రాజకీయ, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.


Read More..

Samantha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సమంత బేబీ బంప్ ఫొటోస్.. షాక్‌లో నెటిజన్లు?

Advertisement

Next Story

Most Viewed