- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND vs AUS : నాలుగో టెస్టుకు వాన గండం.. మూడో రోజు ఆట సాగేనా?
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతుంది. రెండు రోజుల ఆట పూర్తయ్యింది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించే దిశగా వెళ్తున్నది. తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది. ఇక, భారత్ మరోసారి బ్యాటుతో తడబడి కష్టాల్లో పడింది. రెండో రోజు 5 వికెట్లు కోల్పోయి 164 రన్స్ చేసింది. ఇంకా 310 పరుగులు వెనుకబడి ఉన్నది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే రోహిత్ సేన ఇంకా 111 రన్స్ చేయాలి. అయితే, అభిమానులకు ఆస్ట్రేలియా వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్టు అంచనా వేసింది. ముఖ్యంగా మూడో రోజు అంటే శనివారం ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం..శనివారం మధ్యాహ్నం మెల్‌బోర్న్‌లో వర్షం పడేందుకు 79 శాతం చాన్స్ ఉంది. మిడిల్ సెషన్‌లో ఆటకు వరుణుడు అడ్డు పడొచ్చు. గంటకు 45 కి.మీ వేగంతో గాలులు వీయడంతోపాటు వర్షం పడుతుందని అక్యూ వెదర్ అంచనా వేసింది. ఫైనల్ సెషన్‌లోనూ 52 శాతం వర్షం చాన్స్ ఉన్నట్టు తెలిపింది. దీంతో మూడో రోజు మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకున్నాయి.