Merger of parties: తెలంగాణలోఆ రెండు పార్టీల విలీనం

by Prasad Jukanti |
Merger of parties: తెలంగాణలోఆ రెండు పార్టీల విలీనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీపీఐఎంఎల్‌ న్యూడెమొక్రసీ (CPIML New Democracy)కి చెందిన రెండు విప్లవ పార్టీలు విలీనం అయ్యాయి. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర నాయకత్వం హాజరైన కార్యక్రమంలో ఈ విలీనం జరిగింది. సీపీఐఎంఎల్‌ న్యూడెమొక్రసీ పార్టీ వివిధ కారణాల రీత్యా 2013 నుంచి రెండుగా చీలిపోయి పనిచేస్తున్నాయి. తిరిగి ఈ రెండు పార్టీలు కలిసిపోవాలని నేతల అభిప్రాయానికి రావడంతో విలీనం జరిగింది. ఆ రెండు విప్లవ పార్టీలు తిరిగి ఒకటిగా విలీనం కావడం విప్లవ శ్రేణులకు శుభపరిణామమని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. నక్సల్బరి, గోదావరి లోయ, శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో ఏర్పడిన న్యూడెమోక్రసీకి ఘనమైన విప్లవ చరిత్ర ఉంది.

Advertisement

Next Story