Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా !

by Y. Venkata Narasimha Reddy |
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా !
X



దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ ప్రత్యేక సమావేశం(Special session of the Assembly) నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన జరుగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ(Telangana Cabinet Meeting)ని వాయిదా వేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh)కు సంతాప దినాల్లో భాగంగా ఆయనకు నివాళులర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఆ రోజు తలపెట్టిన తెలంగాణ కేబినెట్ భేటీని వాయిదా వేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది.

తదుపరి మళ్లీ కేబినెట్ భేటీ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై ప్రభుత్వం ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. రైతు భ‌రోసాపైన, రేష‌న్ కార్డుల విధివిధానాల‌పై, భూమి లేని నిరుపేద‌ల‌కు న‌గ‌దు బ‌దిలీపైన, యాద‌గిరిగుట్ట ఆల‌య బోర్డుపైన, కుల గణన, స్థానిక సంస్థల ఎన్నికలు వంటి కీలక అంశాలపై కేబినెట్ స‌మావేశంలో చ‌ర్చించి నిర్ణయాలు తీసుకుంటారని భావించారు. దీంతో ఈ దఫా జరుగబోయే కేబినెట్ భేటీపై ఆయా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed