TDP Re-entry: తెలంగాణలో రీ ఎంట్రీకి ప్రశాంత్ కిశోర్ తో టీడీపీ ప్లాన్!

by Prasad Jukanti |
TDP Re-entry: తెలంగాణలో రీ ఎంట్రీకి ప్రశాంత్ కిశోర్ తో టీడీపీ ప్లాన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో టీడీపీ (TTDP)కి పునర్వైభవం తీసుకొస్తామని ఇటీవల చెప్పిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆ దిశగా పెద్ద ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ రీ ఎంట్రీకి సర్వం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రశాంత్ కిశోర్ (Prashanth Kishor), పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ షో టైమ్ రాబిన్ శర్మ (Rabin Sharma)లతో చంద్రబాబు (chandrababu Naidu), నారా లోకేశ్‌తో (Naral lokesh) భేటీ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ భేటీలో తెలంగాణలో టీడీపీ బలోపేతంపై పలు ప్రణాళికలను ప్రశాంత్ కిశోర్, రాబిన్‌శర్మ వారికి అందజేసినట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఇతర పార్టీలోకి వెళ్లిన మాజీలు మళ్లీ సొంత గూటికి వస్తామని కబురు చేస్తున్నారు. తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరుతానని ఏకంగా చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే.

Next Story