- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కోరంలేక చుంచుపల్లి పీసా గ్రామ సభ వాయిదా..

దిశ, మంగపేట : ఇసుక క్వారీ నిర్వాహణ కొరకు గురువారం చుంచుపల్లిలో నిర్వహించిన పీసా గ్రామ సభ వాయిదా వేసినట్లు ఎంపీడీవో భద్రు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు పంచాయతీ కార్యాలయంలో ఎంపీవో మమత అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు తహశీల్దార్ తోట రవీందర్, ఎంపీడీవో భద్రు, పీసా జిల్లా కో ఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, ఆర్ఐ శ్రీనివాస్, ప్రొబెషనరీ ఎస్సైలు శ్రీకాంత్, మహేష్ లు హాజరయ్యారు. 2 గంటల వరకు కూడా గ్రామంలో ఉన్న 621 మంది గిరిజన ఓటర్లలో పీసా గ్రామసభకు కేవలం 63 మంది హాజరైనట్లు పంచాయతీ కార్యదర్శి మోడెం రాజేష్ సంతకాల సేకరణ చేయడంతో కోరం లేక గ్రామసభను ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్లు ఎంపీవో భద్రు ప్రకటించారు.
సభ ప్రారంభానికి ముందు గ్రామానికి చెందిన చెంచులక్ష్మీ, శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఇసుక క్వారీ సొసైటీలకు 2022 నుంచి 26 వరకు ఇసుక క్వారీ నిర్వాహణకు చెందిన సుమారు కోటి 60 లక్షల రూపాయల బకాయిలు గ్రామస్తులకు ఇచ్చేవరకు గ్రామ సభ నిర్వహించడం లేదని గ్రామస్తులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. బకాయిలను గ్రామంలోని 621 మంది ఆదివాసీ గిరిజనులకు పంచే వరకు గ్రామంలో ఎలాంటి గ్రామసభలు పెట్టినా అంగీకరించేది లేదంటూ గిరిజనులు హెచ్చరించారు.