భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన టాలీవుడ్ బ్యూటీ.. అమ్మడు రేంజ్ మామూలుగా లేదంటూ నెటిజన్ల కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-03-31 06:19:10.0  )
భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన టాలీవుడ్ బ్యూటీ.. అమ్మడు రేంజ్ మామూలుగా లేదంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’(Software Devoloper) వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీకి సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అలా ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) సరసన ‘బేబీ’(Baby) మూవీలో నటించి తన యాక్టింగ్‌తో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ప్రస్తుతం స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘జాక్’(Jack) మూవీలో నటిస్తోంది.

ఇక ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. అయితే వైష్ణవి చైతన్య సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌ను పెంచుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీకి జాక్ సినిమా తర్వాత కూడా భారీగానే చాన్సులు వస్తున్నాయట. అటు ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ప్రజెంట్ టాలీవుడ్‌కు ప్రత్యేకించి హీరోయిన్లు ఎవరూ పెద్దగా ఫామ్‌లో లేరు.

దీంతో లోకల్ హీరోయిన్ అయిన వైష్ణవికి ఆఫర్లు తెగ తలుపులు తడుతున్నాయి. ఇక దీన్నే చాన్స్‌గా చేసుకుని ఈ భామ కూడా రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందట. అలా ప్రజెంట్ ఒక్కో సినిమాకు కోటి రూపాయల దాకా తీసుకుంటుందని టాక్. అంతేకాకుండా ఆమె అడిగినంత ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ కూడా ముందుకు రావడం విశేషం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం పై నెటిజన్లు అమ్మడు రేంజ్ మామూలుగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story