- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రంజాన్ పవిత్రత త్యాగం, శాంతి, సమానత్వానికి ప్రతీక : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

దిశ, గోదావరిఖని : రంజాన్ పవిత్రత త్యాగం, శాంతి, సమానత్వానికి ప్రతీక అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. గోదావరిఖనిలో సోమవారం శారదా నగర్, రామగుండం, ఎన్ టి పి సి, ఫోరిక్లయిన్ ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రార్థనలలో ఆయన పాల్గొని మాట్లాడారు. మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయని అన్నారు. అన్ని మతాల ప్రజలు స్నేహభావంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. రామగుండం నియోజకవర్గం లో ఉన్న ఈద్గాలు, కామ్రస్థాన్ నుల అభివృద్ధికి 4 కోట్ల రూపాయలు, షాదీ ఖానా కు రూ.2కోట్లు విడుదల చేయించడం జరిగిందని అన్నారు. రాజీవ్ యువ వికాస పథకం కు అర్హులైన ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవాలని కోరారు. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.