ఈ నెల 30వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

by Kalyani |
ఈ నెల 30వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
X

దిశ, చార్మినార్​ : లాల్​దర్వాజా ఫూల్​బాగ్​ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్​ బాశెట్టి లెనిన్​బాబు తెలిపారు. ఈ నెల 30వ తేదీన ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారికి ప్రత్యేక అర్చనలు, సాయంత్రం 6 గంటలకు నూతన సంవత్సర పంచాంగ శ్రవణం, ఈ నెల 31వ తేదీన పరమపదోత్సవం, ఏప్రిల్ 1వ తేదీన విశ్వక్సేన ఆరాధన, పుణ్యావచనం, కుంభ ఆహ్వానం, శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్య హవనం, శ్రీ లక్ష్మీనారాయణ హోమం, 2వ తేదీన అగ్ని ముఖం, నిత్యహోమం, ఉదయం 7గంటలకు శ్రీ లక్ష్మీ హయగ్రీవ హోమం, శతఘటాభిషేకం, 3వ తేదీన ఉదయం 7 గంటలకు శ్రీ మహాలక్ష్మి హోమం, ఉదయం 9 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, 4వ తేదీన శ్రీ సుదర్శన హోమం, 5వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లక్ష మల్లెపూల పూజ, 6వ తేదీన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణోత్సవం , గరుడ సేవ తోమ ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చైర్మన్​ బాశెట్టి లెనిన్​బాబు కోరారు.

Next Story

Most Viewed