IPL 2025: మరో హైవోల్టేజ్ మ్యాచ్.. టాస్‌ గెలిచిన లక్నో

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-27 13:32:56.0  )
IPL 2025: మరో హైవోల్టేజ్ మ్యాచ్.. టాస్‌ గెలిచిన లక్నో
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2025(Indian Premier League)లో భాగంగా కాసేపట్లో హైవోల్టేజ్ మ్యాచ్ జరుగబోతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం(Uppal Stadium) వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), లక్నో సూపర్ జైంట్స్(Lucknow Super Giants) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లకు ఇది రెండో మ్యాచ్‌లో మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయం సాధించిన SRH అదే ఊపును కొనసాగించాలని చూస్తోంది. ఇక వైజాగ్ వేదికగా ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో ఓటమి చవి చూసింది. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణి కొట్టాలని చూస్తోంది. టాస్‌ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయనున్నది.

Sunrisers HYD
:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (wk), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (c), హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, మహ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్

Lucknow: ఐడెన్ మార్కరమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్ (c & wk), డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్

Next Story

Most Viewed