- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కస్తూర్బాగాంధీ విద్యార్థినుల ఆందోళన..ఎందుకంటే..?
దిశ,నవాబుపేట : మా టీచర్లు మాకు కావాలంటూ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థినులు మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. సుమారు 20 రోజులుగా తమ పాఠశాల ఉపాధ్యాయులు ధర్నా చేస్తుండడంతో ..తమకు పాఠాలు బోధించేవారు లేకుండా పోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు సమీపిస్తున్న ఈ సమయంలో పాఠాలు బోధించకుంటే తాము ఎలా చదువుకోవాలని వారు ప్రశ్నించారు. ఇప్పటికే పోర్షన్ చాలా వెనుకబడి ఉన్నామని,అధికారులు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సత్ఫలితాలు ఇవ్వడం లేదని, ఇలాగే విద్యాలయంలో విద్యా బోధన కొనసాగితే తమ ఉత్తీర్ణత ప్రశ్నార్థకంగా మారుతుందని వారు కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ ఉపాధ్యాయుల డిమాండ్లను అంగీకరించి, వారితో సమ్మె విరమణ చేయించి, తిరిగి వెంటనే విధుల్లో చేరి తమకు పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకపోతుండడంతో..తాము విద్యాలయంలో ఆవాసం ఉండలేకపోతున్నామని,తమకు ఎల్లప్పుడూ తోడు నీడగా వెన్నంటి ఉండే తమ ఉపాధ్యాయులు తిరిగి విధుల్లో చేరితేనే తాము ధైర్యంగా విద్యాలయంలో ఆవాసం ఉండగలుగుతామన్నారు. విద్యార్టినులు పెద్ద ఎత్తున తరలివచ్చి మైదానంలో మూకుమ్మడిగా ధర్నా చేయడాన్ని గమనించిన మండల అధికార యంత్రాంగం వారితో ధర్నాను విరమింప చేసేందుకు అష్ట కష్టాలు పడ్డారు. అధికారులు ఎంత నచ్చజెప్పినా విద్యార్థినిలు చాలాసేపటి వరకు వారి మాటలు వినలేదు. తమ టీచర్లను తమ వద్దకు పంపితేనే ధర్నాను విరమిస్తామని మైదానంలో భీష్మించుకు కూర్చున్నారు. అనంతరం అధికారులు వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చి సమ్మె చేస్తున్న వారి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేసి, సాధ్యమైనంత త్వరలో వారిని విధుల్లో చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో ధర్నాను విరమింపజేసి తిరిగి విద్యాలయానికి వెళ్లారు.