Tamannaah: అందాల తార తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు..!

by Anjali |   ( Updated:2024-12-29 02:29:13.0  )
Tamannaah: అందాల తార తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tollywood star heroine Tamannaah Bhatia) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ మిల్క్ బ్యూటీ భాషతో సంబంధం లేకుండా సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. హ్యాపీడేస్(Happydays), రచ్చ(Racha), ఎందుకుంటే ప్రేమంటే(endhukante Premante ), ఊసరవెల్లి(usaravelli), రెబల్(Rebel), బద్రీనాథ్(Badrinath), కెమెరామెన్ గంగ(Cameraman గంగతో rambabu)తో రాంబాబు, తడాఖా(thadaka), బెంగాల్ టైగర్(Bengal tiger), బాహుబలి, సైరా నరసింహారెడ్డి(Saira Narasimha Reddy), స్త్రీ 2, భోళా శంకర్, జైలర్ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో గొప్ప గుర్తింపు దక్కించుకుంది. అంతేకాకుండా తమన్నా ఐటెమ్ సాంగ్స్‌లో కూడా అదరగొడుతోంది.

ఇండస్ట్రీకి వచ్చి.. ఇన్నేళ్లు అవుతున్నా.. చెక్కు చెదరని అందంతో కుర్రాళ్ల మతిపోగోతోంది. అయితే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు విషయాలు పంచుకుంది. ఇన్నేళ్ల జీవితంలో సంతోషం కోసం ఎప్పుడూ వెతకలేదని వెల్లడించింది. తాను ఏ పని చేసినా అందులోనే ఆనందాన్ని చూసుకుంటానని తెలిపింది. సినీ ఇండస్ట్రీకొచ్చి 15 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందని కానీ.. ఇప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. నా పనే నాకు సంతోషాన్నిస్తుందని.. కానీ వర్క్‌లో కూడా భయంకరమైన డేస్, బోర్ అనిపించిన రోజులున్నాయని పేర్కొంది. అంతేకాకుండా విమర్శలు ఎదుర్కొన్నానని, అవమానాలు పడ్డానని వివరించింది. కానీ ఏమీ పట్టించుకోకుండా ప్రేక్షకులను అలరించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నానని తమన్నాఇంటర్వ్యూలో వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed